Share News

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:55 PM

దీపావళి వేళ ఇంటాబయట ముగ్గులు వేసి.. వాటిని వివిధ రకాల రంగులు, పలు పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే.

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
Golden Rangoli

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి వేళ ఇంటాబయట ముగ్గులు వేసి.. వాటిని వివిధ రకాల రంగులు, పలు పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే దుబాయ్‌లో ఈ దీపావళి పండుగ వేళ విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలతో ముగ్గు(రంగోలి)ను రూపొందించారు. స్థానిక సిటీ సెంటర్ డేరాలో ఈ ప్రత్యేకమైన ముగ్గును ఏర్పాటు చేశారు.


ఈ ముగ్గు కోసం 3.5 కిలోల బంగారు అభరణాలు.. నెక్లెస్‌లు, బరువైన గాజులు, చెవి పోగులతోపాటు పెండెంట్లు వినియోగించారు. ఈ ముగ్గు మరింత అందంగా ఉండడం కోసం 380 క్యారెట్ల వజ్రాలతో అలంకరించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మొత్తం 10 మంది కళాకారులు.. దాదాపు 16 గంటల పాటు శ్రమించి ఈ ముగ్గును రూపొందించారు.


ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ కళాఖండాన్ని పలువురు నెటిజన్లు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇలాంటి విలువైన ఆభరణాలను ఇలా బహిరంగంగా పెట్టడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కళాఖండాన్ని దుబాయ్‌లో మాత్రమే చూడగలమని వారు పేర్కొన్నారు. ఈ వజ్రాలతో అలంకరించిన బంగారు ముగ్గు అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

Updated Date - Nov 11 , 2026 | 04:06 PM