Share News

బిర్యానీ రుచులకు ఫిదా అయిపోయాం

ABN , Publish Date - Oct 27 , 2026 | 09:52 AM

కొరియా.. హైదరాబాద్‌ యువత హార్ట్‌బీట్‌గా మారిందిప్పుడు. అప్పుడెప్పుడో వచ్చిన గంగ్నమ్‌ స్టైల్‌కు ప్రపంచమే ఊగిపోతే... మన హైదరాబాదీ యువత, కొరియన్‌ పాట వస్తే చాలు పూనకాలు లోడింగ్‌ అనేస్తోంది.

బిర్యానీ రుచులకు ఫిదా అయిపోయాం
hyderabad Biryani

  • అభిమానుల ఉత్సాహం మరువలేనిది

  • కొరియన్‌ బాయ్స్‌ బ్యాండ్‌ ఎన్‌టీఎక్స్‌ బృందం

హైదరాబాద్‌ సిటీ: కొరియా.. హైదరాబాద్‌ యువత హార్ట్‌బీట్‌గా మారిందిప్పుడు. అప్పుడెప్పుడో వచ్చిన గంగ్నమ్‌ స్టైల్‌కు ప్రపంచమే ఊగిపోతే... మన హైదరాబాదీ యువత, కొరియన్‌ పాట వస్తే చాలు పూనకాలు లోడింగ్‌ అనేస్తోంది. కె పాప్‌ బీట్‌కు అనుగుణంగా తమ ప్లే లిస్ట్‌లు మార్చేస్తుంది. కె హార్మోనీ ఫెస్టా అంటూ కొరియన్‌ కల్చర్‌ డేను నగరంలో నిర్వహిస్తే వచ్చిన జనసందోహం దీనికి తార్కాణం. అందులో కొరియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్‌టీఎక్స్‌ బ్యాండ్‌ పాటలకు మన యువత ఊగిపోయింది. ర్యాప్‌, హిప్‌హాప్‌ శైలి గీతాలతో పాటు బాలీవుడ్‌ పాట కేసరియా... అంటూ వారు పాడిన పాటకు తన్మయులైపోయారు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఈ ఈ కొరియన్‌ బాయ్స్‌ బ్యాండ్‌ ఎన్‌టీఎక్స్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా పలుకరించింది. నియోట్రాక్స్‌ నెంబర్‌ ఎక్స్‌(ఎన్‌టీఎక్స్‌) గుర్తింపు పొందిన ఈ బృంద సభ్యులు హ్యోంగ్‌ జిన్‌, యున్‌హ్యోక్‌, షిహా, చాంగ్‌హున్‌, హోజున్‌, రాహ్యూన్‌, యున్‌హో, సియుంగ్‌వోన్‌ ఏమన్నారంటే..


యూట్యూబ్‌ చూసి..

ఇండియాకు రావడం మాకిది రెండవ సారి. దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారి న్యూఢిల్లీ వచ్చాం. అప్పుడు ఇండియా గురించి మాకు తెలియదు. ఈ దేశం గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్‌ను ఆశ్రయించాం. వాటిలో మేము చూసిన ఇండియాకు, ప్రత్యక్షంగా చూసిన ఇండియాకు చాలా తేడా ఉంది. అప్పుడు చూసిన ప్రాంతాలు తక్కువ. కానీ, ఈసారి కొత్త ప్రాంతాలను చూశాము. కొత్త వ్యక్తులను కలిశాము. కొత్త ఫుడ్‌ కూడా ట్రై చేశాము.

ఆస్వాదించడమే కాదు.. శ్రద్ధగా వింటారు

ప్రపంచంలో మా ప్రదర్శనలను చాలా ఉత్సాహంతో ఆస్వాదిస్తుంటారు. ఢిల్లీలో మాత్రం ఆస్వాదించడమే కాదు, చాలా శ్రద్ధగా వింటుంటారు. హైదరాబాద్‌లో అభిమానుల ఉత్సాహం చూస్తుంటే మాత్రం ఆనందంగా ఉంది.


city5.2.jpgదాని ప్రభావం అలాంటిది...?!

మీ సంగీతంపై పాశ్చాత్య సంగీత ప్రభావం ఉంటుంది కదా అని అంటే, తప్పకుండా ఉంటుంది. మేము దానిని కాదనము. ఎందుకంటే, హిప్‌హాప్‌, ర్యాప్‌ వంటి సంగీత శైలులు పాశ్చాత్య సంగీతంతో ముడిపడి ఉన్నాయి. దానికి తోడు లాటిన్‌ అమెరికన్‌ సంగీత ప్రభావం, స్ఫూర్తి మా మ్యూజిక్‌పై తప్పకుండా ఉంటుంది.

మా బృందం ఇది..

మా బృందంలో ఒకరు ర్యాపర్‌, ప్రొడ్యూసర్‌ అయితే, మరో ఇద్దరు సాఫ్ట్‌ ర్యాపర్లు. మిగిలిన వారంతా వొకల్స్‌, ఫెర్‌ఫార్మ్‌ చేస్తుంటారు.


ఫీల్‌ బాగుంది...!

బాలీవుడ్‌ గీతం ‘కేసరియా..’ను తాము ఈ సారి ఇండియాలో పాడుతున్నాం. ఎందుకంటే ఆ పాటలోని భావోద్వేగం మాకు బాగా నచ్చింది. అందుకే దాన్ని ఎంచుకున్నాం. బాలీవుడ్‌ మ్యూజిక్‌ వింటుంటాం. భారతీయ పాటలను మా ప్రదర్శనలలో భాగంగా పాడటం ద్వారా ఇక్కడి ప్రేక్షకులతో మరింత అనుబఽంధం ఏర్పడుతుందని భావిస్తున్నాం.

బిర్యానీని వదిలిపెట్టలేకపోయాం

హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. మాకు బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా బిర్యానీ. స్పైసీగా ఉన్నప్పటికీ, అసలు వదలాలనిపించలేదు. ఇక్కడి అభిమానులు కూడా మాకు బాగా నచ్చారు. వారి ఆదరణ అపూర్వం.


ఈ వార్తలు కూడా చదవండి:

హరీశ్‌కు తుమ్మిడిహట్టి భయం పట్టుకుంది!

ఎర్రవల్లి 325 సర్వేనెంబర్‌లో హెచ్చరిక బోర్డులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 09:52 AM