Share News

ఎర్రవల్లి 325 సర్వేనెంబర్‌లో హెచ్చరిక బోర్డులు

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:59 AM

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామ శివార్లలోని సర్వే నెంబర్‌ 325లో అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఎర్రవల్లి 325 సర్వేనెంబర్‌లో హెచ్చరిక బోర్డులు
Survey No 325 Erravalli

  • ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తింపు

  • ఆక్రమిత భూమిని ఇచ్చేందుకు పలువురి అంగీకారం?

గజ్వేల్‌/మర్కుక్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామ శివార్లలోని సర్వే నెంబర్‌ 325లో అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సర్వే నెంబర్‌లో 388.05 ఎకరాల భూమిని సర్వే చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో మర్కుక్‌ తహసీల్దారు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పలువురు రైతుల ఆక్రమణలో ఆ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 388.05 ఎకరాల భూమిలో 45 ఎకరాల భూమి లేకుండా పోయిందని, సదరు భూమిని గుర్తించేందుకు మరోసారి అధికారికంగా రీసర్వే చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


హెచ్చరిక బోర్డుల ఏర్పాటు నేపథ్యంలో అందరి దృష్టి వాటిపై పడింది. తర్వాత ఏం జరుగుతుందని, 45 ఎకరాల భూమిని అధికారులు ఎక్కడ గుర్తిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ భూమి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రానికి ఆనుకుని ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా సదరు భూమికి సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తుంది. కాగా ఈ భూమిని ఆక్రమించిన పలువురితో అధికారులు మాట్లాడగా... వారు ప్రభుత్వానికి అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. రీసర్వేలో అధికారులు ఏం చేస్తారోనన్న ఆలోచనలో రైతులు ఉండగా... కేసీఆర్‌కు ఏమైనా నోటీసులు ఇస్తారా..? అనే అంశంపై స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. హెచ్చరిక బోర్డులతో రైతుల్లో కొంత ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

వరిసాగుతో కరీంనగర్‌ కళకళ

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 05:59 AM