ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:27 AM
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల గ్రాడ్యుయేట్లలో ఆసక్తి కొరవడింది. గతంతో పోల్చితే సగం మంది మాత్రమే ఇప్పటి వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సగానికి పడిపోయిన దరఖాస్తులు
2021లో 10.36 లక్షల ఓటర్లు
ఈ విడత ఇప్పటికి 5.24 లక్షల మంది దరఖాస్తు
వచ్చే నెల 6 వరకే గడువు
తగినంత ప్రచారం లేదంటున్న రాజకీయ వర్గాలు
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల గ్రాడ్యుయేట్లలో ఆసక్తి కొరవడింది. గతంతో పోల్చితే సగం మంది మాత్రమే ఇప్పటి వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఇంకా 11 రోజులే (నవంబర్ 6 వరకు) ఉండటంతో.. పట్టభద్రులు పూర్తిస్థాయిలో ఓటరుగా నమోదు చేసుకుంటారా? లేదా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో అయోమయం నెలకొంది. త్వరలో హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్.. వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గాల పరిధిలో 2021లో ఎన్నికల సమయానికి 10,36,833 మంది ఓటర్లు ఉన్నారు. ఈ విడత ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టగా.. 5,23,758 దరఖాస్తులు ఇప్పటికి వచ్చాయి.
వీటిలో సోమవారం నాటికి 5శాతం (26,085) దరఖాస్తులకు ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. 1,581 తిరస్కరణకు గురికాగా, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 2021లో 5,31,268 మంది ఓటర్లు ఉండగా.. ఈ విడత 2,29,937 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 2021లో 505565 ఓటర్లు ఉంటే.. ఈ విడత 2,93,821 దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఎన్నికల సంఘం అధికారులు తగినంత ప్రచారం నిర్వహించకపోవడం వల్లే ఓటరు నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతోందని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
యూనివర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల అమలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News