అతి తీవ్ర తుపాన్‌గా మారిన ఆర్నబ్: వాతావరణ శాఖ
ABN , Publish Date - Oct 27 , 2026 | 08:34 AM
ఆర్నబ్ తుపాన్.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్రమైన తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది.
విశాఖపట్నం, అక్టోబర్ 27: ఆర్నబ్ తుపాన్.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్రమైన తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఈ తుపాన్ గత 6 గంటలుగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని పేర్కొంది. ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కి.మీ, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 360 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 380 కి.మీ, మచిలీపట్నంకు తూర్పున 460 కి.మీ, బాపట్లకు తూర్పున 530 కి.మీ దూరంలో ఈ తుపాన్ కొనసాగుతోందని వివరించింది.
ఇది ఈ రోజు(మంగళవారం) సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగి.. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ ఆర్నబ్ తుపాన్ అక్టోబర్ 28 (బుధవారం) ఉదయానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాంకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది అతి తీవ్రమైన తుపానుగా కొనసాగుతూ గంటకు 115 నుంచి 125 కి.మీ వేగంతో కొన్నిసార్లు గాలి వేగం గంటకు 140 కి.మీ వరకు పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ పేర్కొంది.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్
ఆర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగలక్ష్మి స్పష్టం చేశారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. గంటకు 115 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. తీర ప్రాంతాల్లోని 14 మత్స్యకార గ్రామాల్లో తుపాను షెల్టర్లు సిద్ధం చేశామని చెప్పారు. తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 08816299181 అని వెల్లడించారు. ఆర్నబ్ తుపాను నేపథ్యంలో అత్యవసరమైత ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.
మూసివేసిన పేరుపాలెం బీచ్: అధికారులు
ఆర్నబ్ తుపాను హెచ్చరికతో నరసాపురం తీరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. నర్సాపురం - సఖినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో రాకపోకలు నిలుపివేసినట్లు వెల్లడించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలను ఆయా కేంద్రాలకు తరలించాలని నిర్ణయించామని అధికారులు చెప్పారు.
మూసివేసిన పేరుపాలెం బీచ్: అధికారులు
ఆర్నబ్ తుపాను హెచ్చరికతో నరసాపురం తీరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. నర్సాపురం - సఖినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో రాకపోకలు నిలుపివేసినట్లు వెల్లడించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలను ఆయా కేంద్రాలకు తరలించాలని నిర్ణయించామని అధికారులు చెప్పారు. అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, నిత్యవసర వస్తువులతోపాటు జనరేటర్ సదుపాయం కల్పించామని వివరించారు. తుపాను తీరం దాటి వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని నరసాపురం ఆర్డీవో ఆదేశించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దీంతో 48 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు ఆర్డీవో సూచించారు.
ఆర్నబ్‌తో తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్
ఆర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ పలు జిల్లాలలో నేడు, రేపు (మంగళ, బుధవారం) వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు జిల్లాలకు ఆరెంజ్, మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. బుధవారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు అతి భారీ వర్షం కూరుస్తుందని సూచించింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
For More AP News And Telugu News