నేడు కరీంనగర్‌కు నితిన్ నబీన్
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:34 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్ రానున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పాదయాత్రలో ఆయన పాల్గొటారు.
మహా పాదయాత్రలో పాల్గొననున్న బీజేపీ అధ్యక్షుడు
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్ రానున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పాదయాత్రలో ఆయన పాల్గొటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్‌లో కరీంనగర్ చేరుకుంటారు. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి వైశ్య భవన్ వద్దకు చేరుకుని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం గాంధీ బొమ్మ, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్, శాస్త్రీ రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు ప్రజలతో కలిసి మహా పాదయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. నితిన్ నబీన్‌కు తెలంగాణ కళాకారుల ఆటపాటలు, డప్పు నృత్యాలతో ఘన స్వాగతం పలుకుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News