Share News

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:56 PM

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విలయంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

హైదరాబాద్, ఆగస్టు 29: నగరంలోని కూకట్‌పల్లికి చెందిన శ్రీధర్ అవ్వారి, ఆయన కుటుంబ సభ్యులు దీప్తి, అభినవ్‌‌లతో కలిసి ఇటీవల మానస సరోవర్ యాత్రకు బయల్దేరారు. వీరంతా ఈషా ఫౌండేషన్ యాత్రికుల బృందంతో కలిసి వెళ్లారు. ఈ నెల 26న ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు.. ఆ తర్వాత నేపాల్‌లోకి ప్రవేశించారు. అప్పటివరకు వారు హైదరాబాద్‌లోని తమ కుటుంబ సభ్యులతో ఫోన్ సంభాషణలు జరుపుతూ, ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని తెలియజేశారు.


కాగా.. నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించిన అనంతరం శ్రీధర్ కుటుంబం ఆచూకీ గల్లంతైంది. రెండు రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియరాలేదు. ఫోన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్లంతైన శ్రీధర్ కుటుంబం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. సంబంధిత అధికారులను సంప్రదించి వారిని క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టింది.


ఇవీ చదవండి:

కొత్త కారు పూజ కోసం వచ్చి.. అదే కారు కింద పడి..

ముళ్లపొదల్లో మహిళ మృతదేహం... ముఖంపై యాసిడ్‌ పోసి దారుణం

Updated Date - Aug 29 , 2026 | 12:56 PM