Share News

కొత్త కారు పూజ కోసం వచ్చి.. అదే కారు కింద పడి..

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:21 PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద జరిగిన ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త కారు పూజ కోసం వచ్చి అదే కారు కిందపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

కొత్త కారు పూజ కోసం వచ్చి.. అదే కారు కింద పడి..

హైదరాబాద్, ఆగస్టు 29: కొత్త కారు కొన్న ఓ కుటుంబం సంతోషం నిమిషాల వ్యవధిలోనే విషాదంగా మారింది. కారుకు పూజ చేయించడం కోసం అల్లుడితో పాటు గుడికి వెళ్లిన మామ.. అదే కారు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.


ఇదీ జరిగింది..

నగరానికి చెందిన ఓ దంపతులు ఇటీవల కొత్త కారును కొనుగోలు చేశారు. దానికి పూజ చేయించేందుకు తమ బంధువు(మామయ్య) రామచంద్రరావును ఆహ్వానించారు. దీంతో అల్లుడు, కుమార్తె‌తో కలిసి పెద్దమ్మగుడికి వెళ్లారాయన. అల్లుడు కారును డ్రైవింగ్‌ చేస్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి రామచంద్రరావు మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఇవీ చదవండి:

భారత్‌కూ అదే ముప్పు

చావుకి బతుక్కి మధ్య..!

Updated Date - Aug 29 , 2026 | 12:26 PM