Share News

ఎల్‌నినోపై సినీ పరిశ్రమ నుంచి సపోర్ట్‌ చేసేందుకు సిద్ధం: నాగార్జున

ABN , Publish Date - Oct 16 , 2026 | 07:04 PM

సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని సినీ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు.. రాబోయే ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో సినీ పరిశ్రమ నుంచి అన్నీ రకాల సహాయసహకారాలు ప్రభుత్వానికి ఉంటాయని నాగార్జున హామీ ఇచ్చారు.

ఎల్‌నినోపై సినీ పరిశ్రమ నుంచి సపోర్ట్‌ చేసేందుకు సిద్ధం: నాగార్జున
hero nagarjuna on el nino effect on telangana

హైదరాబాద్, అక్టోబర్ 16: సూపర్ ఎల్‌నినో అనే ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడంలో సామాన్య ప్రజల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు సహకరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుపై సినీ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు.


‘ప్రపంచ దేశాలపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఇది ఎప్పటివరకు ఉంటుందో తెలియదు. రాబోయే కాలంలో ఈ ఎల్‌నినో ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉండనుంది. ఈ గడ్డు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలి. సినీ పరిశ్రమ వైపు నుంచి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు.. ఎల్‌నినో ప్రభావం తగ్గేవరకు.. ప్రభుత్వానికి సినీ పరిశ్రమ తోడ్పాటును అందిస్తుంది’ అని నాగార్జున పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’: ఏపీ డీజీపీ

Updated Date - Oct 16 , 2026 | 07:40 PM