Share News

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’: ఏపీ డీజీపీ

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:43 PM

మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు, పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆపరేషన్ త్రిశూల్ చేపట్టామని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’: ఏపీ డీజీపీ
AP DGP Harish Kumar Gupta

అమరావతి, అక్టోబర్ 16: మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు, పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ చేపట్టామని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా దత్తలూరు గ్రామం సమీపంలో 9.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్నట్లు సమాచారం అందిందని అన్నారు. డ్రోన్ సాంకేతికత సహాయంతో, 9.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పొలంలో మొక్కజొన్న పంట మధ్యలో దాచి ఉంచిన సుమారు 1,731 గంజాయి మొక్కలను తమ టీం గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో దత్తలూరుకు చెందిన ఉప్పలపాటి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో గత మూడు నెలలుగా ఈ అక్రమ సాగు జరుగుతున్నట్లు తేలిందన్నారు.


తొమ్మిది మంది వ్యక్తులలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పోలీసులను చూసి పరారైనట్లు డీజీపీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఉప్పలపాటి సుబ్బారెడ్డి, మల్లవరపు మనోహర్, గోపవరపు రాజా, కెముడు బుచ్చిబాబు, జడ్డి జీవన్ , తీగల బలరాజు ఉన్నారన్నారు. అలాగే పరారైన వారిని దుక్కేరి రవి, గణేష్, రామలింగంగా గుర్తించినట్లు చెప్పారు. గతంలో చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు గంజాయిని అక్రమంగా తరలించినట్లు విచారణలో ప్రధాన నిందితుడు చెప్పాడని అన్నారు.


ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తుల సహాయంతో ఈసారి గంజాయి సాగు చేపట్టినట్లు నిందితుడు అంగీకరించినట్లు డీజీపీ తెలిపారు. దత్తలూరు పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. అక్రమంగా సాగు చేసిన గంజాయి పంటను నేడు ధ్వంసం చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే వెంటనే తెలియచేయాలని కోరుతున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ స్థానిక ఎన్నికలు.. ఆ మూడు పార్టీలకు ఉమ్మడి గుర్తుల కేటాయింపు

నామినేషన్ల వేళ వైసీపీ దౌర్జన్యాలపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 04:54 PM