Share News

భాగ్యనగరంలో కోతుల బీభత్సం.. మహిళపై దాడి, తీవ్ర గాయాలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:16 PM

భాగ్యనగరంలోని పలు కాలనీల్లో కోతుల గుంపులు ప్రజలను భయాందోళనకు గురిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని విద్యానగర్ నివాస ప్రాంతంలోకి చొరబడిన కోతుల గుంపు ఓ మహిళపై ఒక్కసారిగా దాడి చేశాయి.

భాగ్యనగరంలో కోతుల బీభత్సం.. మహిళపై దాడి, తీవ్ర గాయాలు
Hyderabad Monkey Attack

హైదరాబాద్, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని పలు కాలనీల్లో కోతుల గుంపులు ప్రజలను భయాందోళనకు గురిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని విద్యానగర్ నివాస ప్రాంతంలోకి చొరబడిన కోతుల గుంపు ఓ మహిళపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


విద్యానగర్‌లో కోతుల బీభత్సం..

విద్యానగర్ కాలనీలోకి భారీ సంఖ్యలో ప్రవేశించిన కోతులు ఇళ్లపై, రహదారులపై సంచరిస్తూ హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో వీధిలో వెళ్తున్న ఓ మహిళపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేశాయి. ఊహించని ఈ ప్రమాదంతో సదరు మహిళ తప్పించుకునే లోపే కోతులు ఆమెపై దాడి చేశాయి. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలై, భారీగా రక్తస్రావమైంది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కోతులను బెదరగొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


బయటకు రావాలంటేనే భయం..

విద్యానగర్ పరిసర కాలనీల్లో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయని, దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపై ఉన్న వస్తువులను పాడుచేయడం, బట్టలు చింపేయడం, చేతుల్లో తినుబండారాలు ఉంటే లాక్కోవడం వంటి చర్యలతో కోతులు ప్రజలను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యపై జీహెచ్‌ఎంసీ (GHMC), అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.


సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..

నివాస ప్రాంతాల్లో దాడులు చేస్తున్న కోతులను పట్టుకోవడానికి ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేయాలని, వాటిని పట్టుకుని నగరానికి దూరంగా ఉన్న సురక్షితమైన అటవీ ప్రాంతాలకు తరలించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 12:30 PM