Share News

ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ కేసులో మరో అరెస్ట్‌

ABN , Publish Date - Nov 16 , 2026 | 09:01 PM

ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ కేసులో మరోకరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ యూత్ కరేజ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సల్మాన్‌ఖాన్ అరెస్ట్‌తో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ కేసులో మరో అరెస్ట్‌
MLC Rahmath Baig Case

హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ కేసులో మరోకరిని పోలీసులు ఈరోజు (సోమవారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్ యూత్ కరేజ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సల్మాన్‌ఖాన్ అరెస్ట్‌తో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచి ముమ్మరంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించగా.. తాజాగా సల్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.


కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను ఎంఐఎం పార్టీ హై కమాండ్ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, తనను కొందరు టార్గెట్ చేసుకుని డీప్ ఫేక్ వీడియోల పేరుతో బెదిరించినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రహ్మత్ బేగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 09:27 PM