Share News

రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తోంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:31 PM

రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2వ ఎడిషన్’ కార్యక్రమంలో మాట్లాడారు.

రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తోంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
uttam kumar on rahul gandhi leadership

హైదరాబాద్, నవంబర్ 14: రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి ప్రపంచం మాట్లాడుకుంటోందని.. దేశం ఆయన నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’లో ఆయన మాట్లాడారు.


తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నవంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’లో మంత్రి ఉత్తమ్ ‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ అభివృద్ధి, రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆయన నాయకత్వ లక్షణాల గురించి ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది. ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిని ప్రపంచం గమనిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు.

భారత్ సమ్మిట్‌లో రెండు రోజుల పాటు అర్థవంతమైన చర్చలు జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. సమ్మిట్‌లో జస్టిస్, డెమోక్రసీ అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారన్నారు. దానితో పాటు సంక్షేమం, సోషల్ జస్టిస్, జెండర్ జస్టిస్‌పై దీర్ఘంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు.


ఇవి కూడా చదవండి...

కుర్తా పైజామా వేసుకోవాలని మహేశ్ గౌడ్ రిక్వెస్ట్.. సాయంత్రానికే నెరవేర్చిన రాహుల్

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు రూ.10 లక్షల సుపారీ.. ఏడుగురి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 04:45 PM