రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు రూ.10 లక్షల సుపారీ.. ఏడుగురి అరెస్ట్
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:45 PM
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 14: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బోయ కిషన్‌ను హత్య చేసేందుకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు. హత్య కోసం పాతబస్తీ నుంచి ముగ్గురు వ్యక్తులను రప్పించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. బోయ కిషన్ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో కీలక ఆధారాలపై దర్యాప్తు చేపట్టారు.
అలాగే ఈ కేసులో మరో కీలక వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎల్లమ్మబండ అంబేద్కర్ నగర్‌లో నివసించే బోయ కిషన్‌పై రెండు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో తన కార్యాలయంలో ఉన్న కిషన్‌పై బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తి, సుత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా దాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు పారిపోగా.. తీవ్రంగా గాయపడిన కిషన్, మరో వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం..
కుర్తా పైజామా వేసుకోవాలని మహేశ్ గౌడ్ రిక్వెస్ట్.. సాయంత్రానికే నెరవేర్చిన రాహుల్
Read Latest Telangana News And Telugu News