Share News

హైదరాబాద్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం..

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:26 AM

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లిన విద్యార్థిని.. సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు.

హైదరాబాద్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం..
Rajendranagar Kidnapping

హైదరాబాద్, నవంబర్ 14: నగరంలోని రాజేంద్రనగర్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లిన విద్యార్థిని.. సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. బిడ్డ ఆచూకీ కోసం చుట్టపక్కల వెతికారు. సమీప బంధువులకు ఫోన్‌ చేసి వాకబు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రాజేంద్రగనర్ పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ కనిపించకుండా పోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బాలికకు మాయ మాటలు చెప్పి యువకుడితో పంపించిందని ఓ మహిళపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు.. మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాలికను కిడ్నాప్ చేసిన యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


ఇవి కూడా చదవండి...

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదు.. కేటీఆర్ ఘాటు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 11:30 AM