Share News

రాహుల్‌పై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు.. చర్చకు సిద్ధమని సవాల్

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:02 PM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ భాష ప్రతిపక్ష నేత స్థాయిలో లేదని వ్యాఖ్యానించారు.

రాహుల్‌పై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు.. చర్చకు సిద్ధమని సవాల్
Etela Rajender

హైదరాబాద్, నవంబర్ 14: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు (శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ భాష ప్రతిపక్ష నేత స్థాయిలో లేదని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు గాంధీ కుటుంబానికి అనేక పదవులు ఇస్తే.. ఏఐసీసీ అగ్రనేత దేశాన్ని అవమానిస్తున్నారన్నారు. రాజ్యాంగ సంస్థలను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. సైనికులని కూడా రాహుల్ అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన చేసిన రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా అవినీతి లేకుండా పాలన చేశారా అని ప్రశ్నించారు. మోదీ 12ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి కూడా లేదన్నారు.


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఎంపీ అన్నారు. ‘రాహుల్ గాంధీ.. నీతో చర్చకు సిద్ధం మేము ఎక్కడైనా రాష్ట్రపతి పాలన పెట్టామా? రాహుల్ హైదరాబాద్‌కు వచ్చే ముందు ఇచ్చిన హామీల గురించి మాట్లాడారా. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ లేదు.


బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్‌లలో జరుగుతున్న అల్లర్లలాగా దేశంలోనూ చేయాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రపంచంలో ఏ దేశానికైనా అన్నం పెట్టే స్థాయికి వచ్చింది భారత్.. ప్రజాస్వామ్య దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లను దేవాలయాలుగా భావిస్తారు. రాహుల్ గాంధీ ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆస్కారం లేదని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదు.. కేటీఆర్ ఘాటు విమర్శలు

హైదరాబాద్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 12:17 PM