Share News

ఏపీ బ్రాండ్‌తో పెట్టుబడుల వరద.. రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్లు: ఎమ్మెల్యే గంటా

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:51 PM

విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతమైందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు.

ఏపీ బ్రాండ్‌తో పెట్టుబడుల వరద.. రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్లు: ఎమ్మెల్యే గంటా
MLA Ganta Srinivasa Rao

విశాఖపట్నం, నవంబర్ 14: సీఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతమైందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు (శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇది ఏపీ బ్రాండ్‌కు నిదర్శనమన్నారు. చంద్రబాబు బ్రాండ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహకారంతో ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందంజలో ఉన్నామన్నారు.


గతంలో పరిశ్రమలు ఇక్కడ నుంచి వెళ్లి పోయాయని.. అప్పట్లో కొత్త పరిశ్రమలు రాలేదని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్టుబడుల వరద కొనసాగుతోందన్నారు. రీజినల్ సమ్మిట్ ద్వారా ఇక్కడ ఉన్న పారిశ్రమికవేత్తలకు ప్రాధాన్యం కల్పించామని వివరించారు. పెట్టుబడులకు రక్షణ చట్టం తేవడం చాలా మంచి పరిణామమన్నారు. ఎస్క్రో అకౌంటు క్రియేట్ చేస్తున్నామని.. పెట్టుబడులను ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.


గతంలో పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవని.. ఇప్పుడు ఏపీకి వస్తున్నాయని గంటా అన్నారు. అందరి చూపు ఏపీ వైపే ఉందన్నారు. 2024 ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయని.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో వార్ వన్‌సైడ్‌గా కనిపించిందన్నారు. గతంలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ వచ్చిందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మంచి ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చారని.. గ్రామాల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 01:06 PM