కుర్తా పైజామా వేసుకోవాలని రాహుల్‌కు మహేశ్ గౌడ్ రిక్వెస్ట్.. చాక్లెట్ ఇచ్చిన అగ్రనేత
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:01 PM
గిగ్ వర్కర్ల సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మధ్య ఆసక్తికరణ సంభాషణ జరిగింది.
హైదరాబాద్, నవంబర్ 14: లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. ఈరోజు ఉదయం గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని ప్రారంభించడంతో పాటు బోర్డును కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రాహుల్‌ను మహేశ్ ఓ చిన్న కోరిక కోరారు. కుర్తా పైజామా వేసుకుంటే బాగుంటారని మహేశ్ చెప్పారు. రోజూ కుర్తా పైజామా వేసుకోవాలని రాహుల్‌ను రిక్వెస్ట్ చేశారు. అయితే.. కుర్తా పైజామా ఎందుకని రాహుల్ అడుగగా.. అది వేసుకుంటే బాగుంటుందని మహేశ్ సమాధానం ఇచ్చారు. దీంతో మహేశ్ చేసిన రిక్వెస్ట్‌కు నవ్వుతూ ఓకే చెప్పడమే కాకుండా ఆయనకు చాక్లెట్ ఇచ్చారు రాహుల్. తన రిక్వెస్ట్‌కు రాహుల్ సరే అని చెప్పడంపై మహేశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
బైక్ ర్యాలీలో పరిగెత్తడంపై మహేశ్ గౌడ్ రియాక్షన్
సంక్షేమ పథకం ప్రారంభానికి ముందు గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. అయితే బైక్‌పై కాకుండా మహేశ్ పరిగెత్తుకుంటూ వెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎక్కిన బైక్ స్కిడ్ అయింది. వేరే బైక్ ఎక్కే క్రమంలో వెనక్కి వెళ్ళిపోయా. ముందుకు వచ్చే క్రమంలో పరుగెత్తుకుంటూ వచ్చాను. ఫిట్‌గా ఉన్నా కాబట్టే పరిగెత్తాను. నేను పక్కన లేనిది గుర్తించి రాహుల్ నన్ను పిలిచారు. సోనియా గాంధీ పుస్తకంపై ప్రజల్లో ఏం చర్చ జరుగుతోందని ఆరా తీశారు. రాష్ట్రంలో ఓబీసీల స్థితిగతులతో పాటు.. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం గురించి రాహుల్ అడిగి తెలుసుకున్నారు’ అని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదు.. కేటీఆర్ ఘాటు విమర్శలు
హైదరాబాద్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం..
Read Latest Telangana News And Telugu News