Share News

మహిళల అణచివేతకు కుల-పితృస్వామ్య వ్యవస్థే కారణం: మీనాక్షి నటరాజన్

ABN , Publish Date - May 21 , 2026 | 03:23 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ స్పందించారు. ఈ కేసుపై వస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల అణచివేతకు కుల-పితృస్వామ్య వ్యవస్థే కారణం: మీనాక్షి నటరాజన్
Meenakshi Natarajan

హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ (Meenakshi Natarajan) స్పందించారు. ఈ కేసుపై వస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సమానత్వానికి సమాజం ఇంకా చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోక్సో కేసు తీవ్ర ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. ఈ రోజు (గురువారం) గాంధీభవన్‌లో మీడియాతో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ఈ కేసులో బాధితురాలిని నిందించడం కాదని.. నేరస్తుల పెంపకాన్ని ప్రశ్నించాలని అన్నారు.


కుల సమూహంలో నష్టపోయేది మహిళలే..

నిర్భయ ఘటన నుంచి ఇప్పటి వరకు బాధితురాలినే నిందించే ధోరణి మారలేదని మీనాక్షి నటరాజన్ విమర్శించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫిర్యాదు నమోదవడంతో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయని తెలిపారు. కులాల ప్రకారం మహిళలను అణగదొక్కే పితృస్వామ్య వ్యవస్థ మరోసారి వెలుగులోకి వచ్చిందని ప్రస్తావించారు. కుల సమూహంలో నష్టపోయేది మహిళలేనని పెరియార్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. బాలికల దుస్తులు, పెంపకంపై విమర్శలు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. పితృస్వామ్య సమాజంలో అబ్బాయిల హింసాత్మక ప్రవర్తనను సాధారణంగా చూస్తున్నారని అన్నారు.


కాంగ్రెస్‌లో తిరోగమన ఆలోచనలకు స్థానం లేదు..

కాంగ్రెస్‌లో తిరోగమన ఆలోచనలకు స్థానం లేదని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. నీతి సూత్రాలు మాట్లాడేవారు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. వ్యక్తులపై నిందలు కాదని.. పితృస్వామ్యంపై పోరాటమే అవసరమని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల్లో ‘Safe Environment and Social Gender Justice Sensitization Committee’ ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజిక న్యాయం తర్వాత ఇప్పుడు లింగ న్యాయం కోసం కూడా పోరాడాలని చెప్పుకొచ్చారు. లింగ న్యాయం వర్ధిల్లాలని మీనాక్షి నటరాజన్ ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 03:30 PM