తెలంగాణ నేతలు బాగా పనిచేస్తున్నారు.. రాహుల్, ఖర్గే కితాబు..
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:21 PM
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ నేతలు ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు..
ఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలుతీరును అడిగి ఏఐసీసీ నేతలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు. వరి ధాన్యం సాగు, కొనుగోలుకు సంబంధించిన విషయాలపై రాహుల్, ఖర్గే ప్రత్యేకంగా ఆరా తీశారు. తెలంగాణలో ఆయిల్ ఫాం పంటను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతు సంక్షేమం విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఏఐసీసీ నేతలు సూచించారు. పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చాలా బాగున్నాయని ఏఐసీసీ నేతలు ప్రశంసించారు. గ్రేటర్ ఎన్నికలు ముందు జరపాలా..? లేదా ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు ముందు జరపాలా? అనే అంశం క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. శాఖల వారీగా మంత్రుల నిర్ణయాలని రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి గెలవొచ్చని, కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలని ఖర్గే మార్గనిర్దేశం చేశారు. నేతలు సమష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మంత్రులంతా నిరూపించారని రాహుల్‌గాంధీ కితాబిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు
మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
Read Latest Telangana News And AP News And Telugu News