Share News

లోక్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మహేశ్ గౌడ్, మంత్రుల అరెస్ట్

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:22 PM

లోక్‌‌భవన్‌ వద్ద ఆందోళనకు దిగిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ‘ఛలో లోక్‌భవన్‌’కు కాంగ్రెస్, టీజేఏస్, లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి.

లోక్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మహేశ్ గౌడ్, మంత్రుల అరెస్ట్
Lok Bhavan Protest

హైదరాబాద్, అక్టోబర్ 8: లోక్‌‌భవన్‌ వద్ద ఆందోళనకు దిగిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు(గురువారం) ‘ఛలో లోక్‌భవన్‌’కు కాంగ్రెస్, టీజేఏస్, లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఇండియా కూటమి రాష్ట్ర నేతలు పాల్గొని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్ నుంచి లోక్‌‌భవన్‌ వైపు ర్యాలీగా బయలుదేరిన నేతలను అడ్డుకున్నారు.


లోక్‌భవన్‌కు 300 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోక్‌భవన్‌ వైపుకు రానీయకుండా ఆందోళనకారులను బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలివే

తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసింది.. 92 లక్షల ఓట్లు తొలగించారంటూ మహేశ్ ఆరోపణలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 01:36 PM