Share News

నెల్లూరులో 15 ప్రభుత్వ హైస్కూళ్ల ఆధునికీకరణ: మంత్రి నారాయణ

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:37 PM

గొడ్డలి ప్రభుత్వం మూసేసిన వీఆర్సీ ఆధునికీకరణలో విద్యా యజ్ఞం ప్రారంభించానని మంత్రి నారాయణ అన్నారు. అదే స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు.

నెల్లూరులో 15 ప్రభుత్వ హైస్కూళ్ల ఆధునికీకరణ: మంత్రి నారాయణ
Minister Narayana

నెల్లూరు, అక్టోబర్ 8: గొడ్డలి ప్రభుత్వం మూసేసిన వీఆర్సీ ఆధునికీకరణలో విద్యా యజ్ఞం ప్రారంభించానని మంత్రి నారాయణ అన్నారు. అదే స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈరోజు(గురువారం) ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌లో టీచర్స్, పేరెంట్స్, విద్యాకమిటీ ఆత్మీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూలాపేటలోని డీఎస్‌ఆర్ స్కూల్‌ను దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి రాజకోట తరహాలో నిర్మించారన్నారు. దాతల సహకారంతో సిటీలోని మరో 15 ప్రభుత్వ హైస్కూల్స్‌ను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.


‘గుడిసెలో పుట్టాను.. కష్టాల్లో పెరిగాను.. చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. హరనాథపురం నుంచి వీఆర్సీ వరకు కాలినడకన వెళ్లి చదువుకున్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మా నాన్న ప్రైవేట్ బస్ కండక్టర్‌గా పనిచేసి తెచ్చిన జీతంతోనే కుటుంబం గడిచేది. బాగా చదివి పేదరికాన్ని జయించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పేద విద్యార్థులకు విద్య అనే శాశ్వత ఆస్థిని పంచాలని నిర్ణయం తీసుకున్నా’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య: ప్రశాంతి రెడ్డి

ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌ను ఆధునికీకరించే బాధ్యత వీపీఆర్ ఫౌండేషన్‌కు అప్పగించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. మంత్రి ఆలోచనలకు అనుగుణంగా స్కూల్‌ను తీర్చిదిద్దామని చెప్పారు. నారాయణ విద్యాసంస్థలకు మించి ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న మంత్రికి అభినందనలు తెలియజేశారు. నారాయణ నెల్లూరులో ఉండటం మన అదృష్టమన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో వీపీఆర్ విద్యని కార్పొరేట్ తరహాలో ప్రారంభించామని.. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి లోకేశ్

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 12:38 PM