అధినాయకుడి తీరు నచ్చకే.. వైసీపీ వీడుతున్న నేతలు: ఎమ్మెల్యే గంటా
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:59 AM
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఫలితాలు మాత్రం ఏకపక్షంగా ఉంటాయని భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కూటమి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. గురువారం భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
విశాఖపట్నం, అక్టోబర్ 08: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఫలితాలు మాత్రం ఏకపక్షంగా ఉంటాయని భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కూటమి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. గురువారం భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కండువా కప్పి వారిని పార్టీలోకి ఎమ్మెల్యే గంటా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
వైసీపీ అధినాయకుడు తీరు, వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీని విడుతున్నారని అన్నారు. ఈ చేరికలు ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరెన్నో చేరికలు ఉంటాయని వివరించారు. వైసీపీ ఖాళీ అవుతుందని తాను ముందే చెప్పానని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ క్యాడర్, లీడర్లు అంతా సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. భీమిలి ఓ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తరహాలో అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని వివరించారు. అలాగే అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి.. వస్తున్నాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమలోని అనంతపురం వరకు ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా భీమిలి నియోజకవర్గంలో కొన్ని వందల కుటుంబాలు వైసీపీకి దూరమయ్యాయి. అలాగే విజయనగరం జిల్లాలో కూడా ఇప్పటికే ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో కూటమిదే హవా అనే ఓ ప్రచారం ఊపందుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంటర్వ్యూకు వెళ్తున్న కొడుకు.. అంతలో ఆ తండ్రి ఏం చేశాడంటే.. వీడియో వైరల్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భద్రత పెంచిన కేంద్రం.. ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా