Share News

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘మద్రాస్‌ కెఫే’

ABN , Publish Date - Jun 05 , 2026 | 08:54 AM

ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలతో నిర్మితమవుతున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సాధారణ ప్రయాణికులనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా వ్యాపారులను సైతం ఇట్టే ఆకర్షిస్తోంది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘మద్రాస్‌ కెఫే’
Madras Cafe, Secunderabad Railway Station

  • క్యూ కడుతున్న ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ రెస్టారెంట్లు, కాఫీ షాప్‌లు

హైదరాబాద్‌ సిటీ: ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలతో నిర్మితమవుతున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సాధారణ ప్రయాణికులనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా వ్యాపారులను సైతం ఇట్టే ఆకర్షిస్తోంది. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం 10వైపు పునరాభివృద్ధి పనులు దాదాపు 90శాతం పూర్తయ్యాయి. ఇటీవల కొన్ని ప్లాట్‌ఫారాల్లో రెస్టారెంట్‌లు, కాఫీషాప్‏లు, ఇతర ఔట్‌లెట్‌ల కోసం ఎస్‌సీఆర్‌ అధికారులు టెండర్లు పిలవగా, దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ బ్రాండ్‌ కలిగిన సంస్థలు పాల్గొన్నట్లు తెలిసింది.


అందులో అంతర్జాతీయంగా బ్రాండ్‌ కలిగిన దక్షిణభారత సంస్థ మద్రాస్‌ కెఫే కూడా ఉండడం విశేషం. సంప్రదాయ దక్షిణ భారత ఫిల్టర్‌ కాఫీ అందించే మద్రాస్‌ కెఫే తొలుత చెన్నైలో ప్రారంభమైనప్పటికీ, ఈ ఫ్రాంచైజీ భారతదేశం దాటి యూఏఈ (అబుదాబిలోని స్టోర్లతో సహా) వంటి ప్రపంచ మార్కెట్లకు విస్తరించిందని తెలుస్తోంది.


city3.3.jpgప్రపంచవ్యాప్తంగా 150-170కి పైగా అవుట్‌లెట్‌లతో, ఫిల్టర్‌ కాఫీతో పాటు ఇడ్లీలు, దోసెలు, వడల వంటి ప్రామాణిక ప్రాంతీయ చిరుతిళ్లను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉందని అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మద్రాస్‌ కెఫే ఏర్పాటుకు ఎస్‌సీఆర్‌ ఇప్పటికే అంగీకారం తెలుపగా, మరికొన్ని ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ ఔట్‌లెట్‌లు, కియోస్క్‏లకు త్వరలోనే అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం’లాంటి కట్టుకథ!

తాజా నిబంధనల మేరకే పదోన్నతులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 09:53 AM