ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఘోర పరాజయం
ABN , Publish Date - Jun 05 , 2026 | 07:53 AM
ఐపీఎల్ 2026లో ఆర్సీబీని విజేతగా నిలబెట్టిన ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ అందుకున్న కొన్ని రోజులకే కెప్టెన్‌గా అతనికి ఘోర పరాజయం ఎదురైంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీకి వరుసగా రెండు ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు. ఐపీఎల్ 2026 టైటిల్ అందుకున్న కొన్ని రోజులకే కెప్టెన్‌గా అతనికి ఘోర పరాజయం ఎదురైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ప్రస్తుతం రజత్ పాటిదార్ మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. గ్వాలియర్ చీతాస్ జట్టుకు పాటిదార్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం ఇండోర్ వేదికగా ఉజ్జయిన్ ఫాల్కన్స్, గ్వాలియర్ చీతాస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చీతాస్ జట్టు 92 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉజ్జయిన్ ఫాల్కన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. మాధవ్ తివారీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
అనంతరం గ్వాలియర్ చీతాస్ దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2026లో 501 పరుగులు చేసిన పాటిదార్.. ఈ మ్యాచ్‌లో కేవలం 11 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఉజ్జయిన్ ఫాల్కన్స్ బౌలర్లలో ఆయుష్ మంకర్ మూడు వికెట్లతో రజత్ పాటిదార్ టీమ్ పతనాన్ని శాసించాడు. గ్వాలియర్ చీతాస్ 129 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గ్వాలియర్ చీతాస్ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం భోపాల్ లెపర్డ్స్‌తో ఆడనుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడబోయే అప్‌కమింగ్ టీ20 సిరీస్‌లకు రజత్ పాటిదార్‌ను ఎంపిక అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!