Share News

ఖాలీన్‌స్కా సంచలనం

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:32 AM

వరల్డ్‌ నెంబర్‌వన్‌ సబలెంకను మట్టికరిపించిన డయానా ష్నైడర్‌కు సెమీ్‌సలో మాయా ఖాలీన్‌స్కా ఝలక్‌ ఇచ్చింది. అద్వితీయ ఆటతీరు కనబర్చిన తను తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి...

ఖాలీన్‌స్కా సంచలనం

  • ఫైనల్లో ప్రవేశం

  • సెమీ్‌సలో ష్నైడర్‌ ఓటమి

  • తుదిపోరుకు ఆండ్రీవా

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

వరల్డ్‌ నెంబర్‌వన్‌ సబలెంకను మట్టికరిపించిన డయానా ష్నైడర్‌కు సెమీ్‌సలో మాయా ఖాలీన్‌స్కా ఝలక్‌ ఇచ్చింది. అద్వితీయ ఆటతీరు కనబర్చిన తను తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగుపెట్టిన క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టించింది. అటు రష్యన్‌ టీనేజర్‌ ఆండ్రీవా సైతం కెరీర్‌లో మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ తుదిపోరుకు అర్హత సాధించింది. దీంతో నయా చాంపియన్‌కు రంగం సిద్ధమైంది.

పారిస్‌: ఆద్యంతం అనూహ్య ఫలితాలతో ఆసక్తికరంగా సాగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌ ప్రత్యర్థులెవరో తేలిపోయింది. క్వాలిఫయర్‌ మాయా ఖాలీన్‌స్కా (పోలెండ్‌)-19 ఏళ్ల ఆండ్రీవా (రష్యా) మధ్య శనివారం టైటిల్‌ ఫైట్‌ జరుగనుంది. ఈ ఇద్దరికీ మేజర్‌ టోర్నీలో తుది పోరుకు చేరడం ఇదే తొలిసారి. గురువారం జరిగిన సెమీ్‌సలో ఖాలీన్‌స్కా 7-6 (7-4), 6-4 తేడాతో 25వ సీడ్‌ ష్నైడర్‌ (రష్యా)ను ఓడించింది. తొలి సెట్‌ హోరాహోరీగా సాగడంతో టైబ్రేక్‌కు వెళ్లింది. ఇక తొలి సెమీ్‌సలో రష్యన్‌ టీనేజర్‌ ఆండ్రీవా (రష్యా) 6-1, 6-3 తేడాతో మార్టా కోస్టుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. రెండేళ్ల క్రితం ఇదే గ్రాండ్‌స్లామ్‌ సెమీ్‌సలో ఓడిన ఆండ్రీవా 21వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన మూడో పిన్నవయస్కురాలు. అలాగే 2005 తర్వాత జన్మించిన క్రీడాకారిణుల్లో ఓ మేజర్‌ సింగిల్స్‌ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గానూ నిలిచింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వీరిద్దరూ కరచాలనం చేసుకోలేదు. ఉక్రెయిన్‌కి చెందిన కోస్టుక్‌ ప్రత్యర్థితో ఫొటో దిగడానికి కూడా ఇష్టపడలేదు.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 04:32 AM