Share News

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:36 AM

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి విజయలక్ష్మి (26) అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన సదరు యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు మీడియాకు వెల్లడించారు. విజయలక్ష్మి రెండు రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, మంగళవారం హుస్సేన్ సాగర్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది.


పోలీసుల విచారణ..

పెళ్లి కావడం లేదనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతోందని.. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. విజయలక్ష్మి గత కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్ (మానసిక కుంగుబాటు)తో బాధపడుతోందని వెల్లడించారు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఆమె క్రమం తప్పకుండా మందులు వాడుతోందని తెలిపారు. మానసిక వేదనను భరించలేకనే యువతి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 11:53 AM