రేవంత్ సర్కారుకు కాలం దగ్గర పడ్డది
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:40 AM
రేవంత్‌రెడ్డి సర్కారుకు కాలం దగ్గర పడిందని, ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్దిపేట.. సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్‌సకు సమాధి కట్టడం ఖాయం
రైతుల బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏంది?: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి సర్కారుకు కాలం దగ్గర పడిందని, ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్దిపేట.. సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిద్దిపేటసభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు కరువులు, కన్నీళ్లతో అల్లాడుతుంటే చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా? అని సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. నీళ్ల దోపిడీ జరుగుతుంటే... నిజాలు చెప్పే వాళ్ల మీద నిందలు మోపుతావా? అని నిలదీశారు.
‘‘జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? సిరిసిల్లలో.. సిద్దిపేటలో పనికిమాలిన మాటలు.. పిచ్చి ప్రేలాపనలు! రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏంది? అవినీతి జాతర చేస్తూ, అబద్ధాలతో, అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తావ్? నీ సర్కారుకు కాలం దగ్గర పడ్డది. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ఉద్యమ శిఖరం కేసీఆర్‌ను దూషించి పైశాచిక ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు? కేసీఆర్ ఒక కల్పవృక్షం.. నువ్వొక కలుపు మొక్క!’’అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
పర్సెంటేజీల పాలన
‘‘రేవంత్‌ది ప్రజాపాలన కాదు.. పర్సెంటేజీల అవినీతి పాలన. అవినీతి, కుంభకోణాల సర్కార్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భూపాలపల్లికి చెందిన పలువురు నాయకులు గురువారం, కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతల అవినీతి బట్టబయలైందన్నారు. 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉందని, నిధులన్నీ కొడంగల్‌కు తరలించుకుపోతున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత రానున్న రోజుల్లో బీఆర్‌ఎ్‌సకు బలంగా మారుతుందని.. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్
Read latest Telangana News And Telugu NEws