నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:07 PM
అగ్నిమాపక శాఖ, ఎస్‌పీఎఫ్ డీజీగా వీసీ సజ్జనార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వారి ఉనికి కోసం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 19: అగ్నిమాపక శాఖ, ఎస్‌పీఎఫ్ (SPF) డీజీగా వీసీ సజ్జానార్ ఈరోజు (గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వారి ఉనికి కోసం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారు కచ్చితంగా చట్టాన్ని ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వీటన్నంటికీ సమయమే సమాధానం చెబుతుందని.. తాను రోడ్డెక్కి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. సజ్జనార్ పేరు పెడితే మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. 26 ఏళ్లలో 20 ట్రాన్స్‌ఫర్స్ అయ్యాయని.. ప్రభుత్వం ఏ పోస్టింగ్ ఇచ్చినా తన వంతు కృషి చేస్తానని ఫైర్ సేఫ్టీ డీజీ సజ్జనార్ స్పష్టం చేశారు.
కాగా.. తెలంగాణ ఫైర్ డీజీగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. నానక్‌రామ్ గూడలోని ఫైర్ డీజీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే హైదరాబాద్ సీపీ, సైబరాబాద్ సీపీతో పాటు పోలీస్ శాఖలో పలు కీలక హోదాల్లో ఆయన పనిచేశారు. ఇప్పుడు ఫైర్ సర్వీసెస్ విభాగం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ఫైర్ సేఫ్టీ నిబంధనలపై సిబ్బందికి సజ్జనార్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws