ఆరోపణలే తప్ప.. రేవంత్‌పై మోదీ చర్యలేవీ?
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:17 AM
హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా... ఆర్‌ఆర్ ట్యాక్స్ పేర రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించడమే తప్ప చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
బిల్డర్ల నుంచి అడుగుకు 200 వసూలు వాస్తవం: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా... ఆర్‌ఆర్ ట్యాక్స్ పేర రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించడమే తప్ప చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్‌లోని బిల్డర్లు, డెవలపర్లు ఎవరిని అడిగినా ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి చెబుతున్నారని, అయినా మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంపె చర్యలు చేపట్టకపోవడానికి కారణమేంటని నిలదీశారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో బిల్డర్ల నుంచి అడుగుకు రూ.200వసూలు చేస్తున్నది వాస్తవమని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ విషయం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. బీజేపీ నేతలది ఉత్త మాటలేనని, చేత లు ఉండవని ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News