Share News

విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:59 PM

విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి సీఎం రేవంత్ రెడ్డి మరణశాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ స్కాంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని విమర్శించారు.

విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 15: విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి సీఎం రేవంత్ రెడ్డి మరణశాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ స్కాంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని విమర్శించారు. ఈ విదేశీ బొగ్గు స్కాంను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను కేటీఆర్ విడుదల చేశారు. భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే సీఎం రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో కావాలనే కృత్రిమ బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం సృష్టించి అదను చూసి సదరు కంపెనీని రంగంలోకి ఆయన దింపారని మండిపడ్డారు.


భోత్రా లాజిస్టిక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సింగరేణి సంస్థ చేసుకున్న అన్ని రహస్య ఒప్పందాలను బయటపెట్టాలని సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపిక చేశారో సమాధానం చెప్పాలని తెలంగాణ సీఎంను ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ - బీజేపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.


యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు సింగరేణిలో G9 బొగ్గు లేదని అబద్ధాలు చెప్పడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు రూ.60 వేల కోట్ల బాకీ చెల్లించకుండా సంస్థను కుప్ప కూల్చే కుతంత్రం చేస్తున్నారని రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. దేశీయ సంస్థలను పక్కనపెట్టి కమీషన్ల కోసమే విదేశీ బొగ్గు కోసం వెంపర్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.


కమీషన్ల ముసుగులో ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగం సిద్ధం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. దీనిని అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నారంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణిని బలహీనపరిచి.. విదేశీ బొగ్గు దిగుమతికి జరుగుతున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని రేవంత్ సర్కార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు.. పచ్చి దోపిడీ: కల్వకుంట్ల కవిత

కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు

For More TG News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 06:12 PM