కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు.. పచ్చి దోపిడీ: కల్వకుంట్ల కవిత
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:18 PM
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి మండిపడ్డారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపిడీ, లూటీ పాలన అంటూ అభివర్ణించారు.
హైదరాబాద్, అక్టోబర్15: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి మండిపడ్డారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపిడీ, లూటీ పాలన అంటూ అభివర్ణించారు. అనుచరులు, ఆప్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిబంధనల ఉల్లంఘనలు అని విమర్శించారు. అర్హతలు లేని వారికి కమీషన్ల కోసం పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు, వ్యాపారులకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఆగడాలు ఏమిటని ప్రభుత్వాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు.
కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టబోమని కవిత హెచ్చరించారు. తెలంగాణలోనూ మహిళా రైతుల సాధికారత చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రైతులకు, రైతు కూలీలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళా రైతులకు ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రత తదితర ప్రయోజనాలు అందించాలని రేవంత్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు
కామారెడ్డిలో ఏటీఎం చోరీ.. అర్థరాత్రి నైటీలో వచ్చి..
For More TG News And Telugu News