కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:57 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో శ్రేణులు బై బై చెప్పి.. టీడీపీ కుండువా కప్పుకున్నాయి.
చిత్తూరు, అక్టోబర్15: జిల్లాలోని కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో శ్రేణులు బై బై చెప్పి.. టీడీపీ కుండువా కప్పుకున్నాయి. గురువారం అధికార పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో ఆయా శ్రేణులు టీడీపీలో చేరాయి. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునుస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విద్యాసాగర్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కుండవా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి ఆయనతో కలిసి నడిచేందుకు టీడీపీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. కుప్పం అభివృద్ధి సీఎం చంద్రబాబుతో సాధ్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో ప్రలోభాలకు గురి చేసిన వైసీపీ పూర్తిగా ఖాళీ కావడం తథ్యమని జోస్యం చెప్పారు.
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లాల వరకు ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కుప్పంలోని వైసీపీ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. ఆ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నాయి. అవి మరికొన్ని గంటల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఇక విజయనగరం జడ్పీ చైర్మన్, బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను ఇటీవల వైసీపీ వీడారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జిల్లాలోని ఆయన ప్రధాన అనుచరులు కూడా టీడీపీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయిందనే ఓ చర్చ సాగుతోంది. అలాగే అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో కూడా వైసీపీ వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కామారెడ్డిలో ఏటీఎం చోరీ.. అర్థరాత్రి నైటీలో వచ్చి..
నర్సాపూర్లో ఫుడ్ పాయిజన్.. యువకుడి మృతి
Read Latest AP News And Telugu News