తెలంగాణ ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా ఎదుగుతోంది: కేటీఆర్
ABN , Publish Date - Jul 16 , 2026 | 10:36 AM
తెలంగాణలో ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చేందుకు కేసీఆర్ హయాంలో చేసిన తమ ప్రయత్నాలు ఫలించడం చూసి చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, జులై 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చేందుకు కేసీఆర్ హయాంలో చేసిన తమ ప్రయత్నాలు ఫలించడం చూసి చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లోని గిగా కారిడార్‌లో అమరరాజా సంస్థ 'కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్' (CQP)ను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇది మహబూబ్‌నగర్‌లో ఆ సంస్థ పెట్టనున్న రూ.9,500 కోట్ల పెట్టుబడిలో కీలక మైలురాయని తెలిపారు.
తాము సాధించగలిగిన అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ (ఇంధన నిల్వ) పెట్టుబడుల్లో ఇది ఒకటని కేటీఆర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆ కంపెనీ గిగాఫ్యాక్టరీలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడానికి ముందే, ప్రొడక్ట్, ప్రాసెస్ క్వాలిఫికేషన్‌కు ఈ సదుపాయం వీలు కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. తద్వారా బ్యాటరీ ఆర్ అండ్ డీ (పరిశోధన), కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు మధ్య ఇది ఒక వారధిలా నిలుస్తుందని వివరించారు. ఇది అధునాతన ఎనర్జీ స్టోరేజ్ తయారీ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
ఆస్తి వేలం వివాదం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News