ప్రారంభమైన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర.. పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు
ABN , Publish Date - Nov 25 , 2026 | 10:18 AM
డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ ఇండియా లక్ష్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు (బుధవారం) ‘నషా ముక్త్ భారత్’ పేరుతో హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పాదయాత్రను చేపట్టారు.
హైదరాబాద్, నవంబరు 25: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ‘నషా ముక్త్ భారత్’ పేరుతో హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పాదయాత్రను చేపట్టారు. ఉదయం అంబర్‌పేట మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. తొలిరోజు ముషీరాబాద్ వరకు కొనసాగనుంది. కాగా.. ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ పాల్గొన్నారు.
నేటి నుంచి మూడు రోజులపాటు ‘నషా ముక్త్ భారత్’ పేరుతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. విద్యార్థులు, యువతలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ ఇండియా లక్ష్యంగా చేపట్టిన ఈ పాదయాత్ర 25, 26, 27వ తేదీల వరకు కొనసాగుతుంది. అంబర్‌పేట నుంచి జూబ్లిహిల్స్ వరకు వరుసగా మూడు రోజులపాటు ఈ పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ రోజు ఉదయం అంబర్‌పేట్ మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర.. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్, ఇఫ్లూ , గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ వరకు కొనసాగనుంది. ముషీర్‌బాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వద్ద తొలిరోజు పాదయాత్రను ముగించి.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News