పెద్ది సుదర్శన్ కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం
ABN , Publish Date - Aug 08 , 2026 | 02:47 PM
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
హైదరాబాద్, ఆగస్టు 8: దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు ఇచ్చి అండగా నిలవాలని అధినేత నిర్ణయించారు. అంతటితో కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
హైడ్రాలో ఉద్యోగాల కోసం వస్తే అవమానిస్తారా.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే: హరీశ్ రావు
పోక్సో కేసులో పృథ్వీశ్వర్‌కు షాక్.. తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్
Read Latest Telangana News And Telugu News