Share News

ఐఐఐటీ జంక్షన్‌ వద్ద మరో మూడు నెలలు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 07:29 AM

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద బహుళ అంతస్తుల ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలను మరో మూడు నెలల పాటు పొడిగించారు.

ఐఐఐటీ జంక్షన్‌ వద్ద మరో మూడు నెలలు ట్రాఫిక్‌ ఆంక్షలు
iiit junction traffic restrictions

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద బహుళ అంతస్తుల ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలను మరో మూడు నెలల పాటు పొడిగించారు. డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నం.1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు రహదారిని మూసివేయనున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. నిర్మాణ పనుల పురోగతి, రహదారి స్థల లభ్యతను బట్టి దశలవారీగా కొంతమేర ట్రాఫిక్‌కు అనుమతించనున్నట్లు తెలిపారు.


city2.2.jpg

వాహనాల మళ్లింపు ఇలా..

  • రాడిసన్‌ హోటల్‌ నుంచి డీఎల్‌ఎఫ్‌ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలను డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నం.1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద కుడివైపు మలుపు తీసుకొని ఇందిరానగర్‌ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకోవాలి.


  • లింగంపల్లి వైపు నుంచి డీఎల్‌ఎఫ్‌ రహదారి మీదుగా రాడిసన్‌ హోటల్‌ జంక్షన్‌కు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి ఐఐఐటీ జంక్షన్‌ చేరుకొని, గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద ఎడమ వైపు, రాడిసన్‌ జంక్షన్‌ వద్ద మరోసారి ఎడమ వైపు మలుపు తీసుకొని డీఎల్‌ఎ్‌ఫకు చేరుకోవాలి.

  • టీసీఎస్‌ సంస్థలోని నాన్‌-ఎ్‌సఈజెడ్‌ (సీఎంసీ) గేట్‌ ద్వారా రాకపోకలు సాగించే ఉద్యోగులకు తమ సాధారణ గేట్‌ నుంచే ప్రవేశం, నిష్క్రమణకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హరీశ్‌కు తుమ్మిడిహట్టి భయం పట్టుకుంది!

ఎర్రవల్లి 325 సర్వేనెంబర్‌లో హెచ్చరిక బోర్డులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 07:29 AM