వీఆర్‌ఎస్‌కు ఓ ఐఏయస్ దరఖాస్తు!
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:36 AM
తెలంగాణ కేడర్‌లో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఏయస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలో అవకాశం
హైదరాబాద్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కేడర్‌లో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఏయస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన వీఆర్‌ఎస్ దరఖాస్తును డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి పంపి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. ఆమోదం రాగానే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.
సదరు అధికారి 2027 సెప్టెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, 10 నెలల ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2025 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఓ అంతర్జాతీయ సదస్సును ఆయనే పర్యవేక్షించారు. గతంలో తెలంగాణలో సీనియర్ ఐఏయస్ అధికారిగా ఉన్న ఐఏయస్ అధికారి ఎస్.ఏ.ఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ప్రైవేటు రంగంలోకి వెళ్లారు.