Share News

ట్యాంకర్లే దిక్కాయే..!

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:10 AM

వర్షాలు పడకపోవడంతో ఎన్నడూ లేని విధంగా జూలై చివర కూడా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.

ట్యాంకర్లే దిక్కాయే..!

  • వానల్లేక ఎండిపోయిన బోరుబావులు

  • కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలో ప్రజలకు తీరని నీటి కష్టాలు

కొండాపూర్‌(హైదరాబాద్): వర్షాలు పడకపోవడంతో ఎన్నడూ లేని విధంగా జూలై చివర కూడా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న కాలనీవాసులకు నీటి సరఫరా తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా బోరు బావులు పూర్తిగా ఎండిపోయాయి. స్థానికులు మొత్తం ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కులాయిల నీటి సరఫరా గంట నుంచి అరగంటకు కుదించారు. పై నుంచి నీటి సరఫరా తగ్గడంతో తప్పనిసరి పరిస్థితిలో కులాయిలకు సరఫరా సమయాన్ని తగ్గించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు.


xx.jpgకొండాపూర్‌ తులిప్‌ వద్ద ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు మెయిన్‌ రిజర్యాయర్‌ నుంచి ఫిబ్రవరి వరకు 19 గంటలు నీటిని సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం 14 గంటలు మాత్రమే సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈ ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నుంచే దాదాపు 10 నుంచి 15 కాలనీలకు కులాయిల ద్వారా, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గత సంవత్సరం జూలైలో కేవలం 40 ట్యాంకర్ల నీటి సరఫరాకు డిమాండ్‌ ఉండేది. కానీ ఈ జూలైలో మాత్రం ప్రతీ రోజు 200 ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. పై నుంచి నీటి పరిణామం తగ్గి వినియోగదారుల నీటి అవసరాలు పెరగడంతో అఽధికారులు తలలు పట్టుకుంటున్నారు. వర్షాలు పడితే కానీ ఈ పరిస్థితి మారదని అధికారులు అంటున్నారు.


రోజు విడిచి రోజు వదులుతున్నారు..

నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. నల్లా నీటిని కేవలం అరగంట మాత్రమే రోజు విడిచి రోజు వదులుతున్నారు. బోరుబావులు పనిచేయడం లేదు. ట్యాంకర్ల నీరే ఆధారం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అధికారులను అడిగితే పై నుంచి వచ్చే నీటి సరఫరా తగ్గిందని చెప్తున్నారు.

  • నర్సింగరావు, రాఘవేంద్రకాలనీ


ప్రజలు నీటి వినియోగంపై దృష్టిపెట్టాలి

వాతావరణ అసమతుల్యతకు ప్రజలు కూడా కారణమే. నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకోకుండా విపరీతంగా నిర్మాణాలు చేపట్టడం ఈ సమస్యకు ఒక కారణమే. ప్రతీ నిర్మాణానికి నీటి గుంతలు ఉండేలా అధికారులు తప్పనిసరి చేయడం లేదు. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇంకా నీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది.

  • శారద, ఓయూ ప్రొఫెసర్‌, రాఘవేంద్రకాలనీ


ఈ వార్తలు కూడా చదవండి:

ఖైదీకి వార్డర్‌కు మధ్య.. మూడో వ్యక్తి!

10 వేల కోట్లతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 11:10 AM