Share News

గ్రేటర్‌ పరిధిలో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు

ABN , Publish Date - Aug 15 , 2026 | 09:35 AM

డిజిటలైజేషన్‌ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్‌ స్మార్ట్‌కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.

గ్రేటర్‌ పరిధిలో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు
Hyderabad ration smart cards

  • నేడు మండలాల వారీగా అందజేత

హైదరాబాద్‌ సిటీ: డిజిటలైజేషన్‌ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్‌ స్మార్ట్‌కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా పంపిణీ చేసిన తర్వాత.. జిల్లాల వారీగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


city2.2.jpgగ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌ జిల్లాలో 8.39 లక్షలు, రంగారెడ్డిలో 6.53 లక్షలు, మేడ్చల్‌లో 6.49 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. తొలివిడతగా మండలానికి వెయ్యి చొప్పున అందజేసి, మిగతా కార్డులను డీలర్ల ద్వారా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గ్రేటర్‌లో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు అందనున్నట్లు వారు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?

సింగరేణిలో మారనున్న ’గుర్తింపు’ ప్రక్రియ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 09:35 AM