గ్రేటర్‌లో మినీ బస్సులు
ABN , Publish Date - Aug 05 , 2026 | 07:39 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెరిగిన ట్రాఫిక్‌తో సులభంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చేందుకు శివారు ప్రాంతాల్లో ఫీడర్ సర్వీసులు నడుపాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మినీ బస్సులు రోడ్లపైకి తీసుకుచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది.
సెట్విన్ తరహా మినీ బస్సులు పెద్దసంఖ్యలో రోడ్లపైకి తీసుకువచి క్యూర్ పరిధిలో ఆర్టీసీ సేవలు మరింత విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో చార్మినార్ ప్రాంతంలో 100 మినీ బస్సులు నడిపిన ఆర్టీసీ అవి పాతబడటంతో స్ర్కాప్ కింద తొలగించింది. దీంతో కొత్తగా మొదటి దశలో 100 మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
తగ్గిన పసిడి.. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఇవీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News