సైబర్ మోసాల నివారణకు గైడ్‌లైన్స్ ఇవ్వండి
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:24 AM
సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రామాణిక విధివిధానాలను రూపొందించాలని సుప్రీంకోర్టు మంగళవారం రిజర్వు బ్యాంకును ఆదేశించింది. సైబర్ మోసాలతో సంబంధం ఉన్న...
రిజర్వు బ్యాంకుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 4: సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రామాణిక విధివిధానాలను రూపొందించాలని సుప్రీంకోర్టు మంగళవారం రిజర్వు బ్యాంకును ఆదేశించింది. సైబర్ మోసాలతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలు, మ్యూల్ ఖాతాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనేదానిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ని తయారు చేసి, అందరికీ తెలియజేయాలని సూచించింది. నకిలీ పత్రాల ద్వారా డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్న సంఘటనలపై సుమోటోగా విచారణ జరిపిన ధర్మాసనం రిజర్వు బ్యాంకుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. సైబర్ మోసాలపై అందిన ఫిర్యాదులను రాష్ట్రాల వారీగా, బ్యాంకుల వారీగా విభజించి నిర్వహించాలని ఆదేశించింది. ఈ కేసుల్లో బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాల్సి వస్తే వాటిపై సత్వరమే దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసులకు సూచించింది. డిజిటల్ అరెస్టుల నివారణ, మోసపోయిన సొమ్మును తిరిగి వసూలు చేయడంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్ విభాగాల కమిటీని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..