ఓఎంఆర్ షీట్లలో తేడాలు!
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:22 AM
తాము జవాబులు గుర్తించిన ఓఎంఆర్ షీట్లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) అప్‌లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్లకు తేడాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆరుగురు నీట్ అభ్యర్థులు మంగళవారం సుప్రీంకోర్టును...
సుప్రీంను ఆశ్రయించిన ఆరుగురు నీట్ అభ్యర్థులు
న్యూఢిల్లీ, ఆగస్టు 4 : తాము జవాబులు గుర్తించిన ఓఎంఆర్ షీట్లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) అప్‌లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్లకు తేడాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆరుగురు నీట్ అభ్యర్థులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ కౌన్సెలింగ్‌కు ముందే తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను అభ్యర్థించారు. ఈ విషయమై ఎన్టీయేకు మెయిల్ ద్వారా, కార్యాలయానికి వెళ్లి తెలియజేసినా ఎటువంటి ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. దీంతో బెంచ్ ఈ విషయమై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. కాగా తమకు లై డిటెక్టర్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించాలని స్వచ్ఛందంగా కోరుతున్నామని నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులైన ముగ్గురు వ్యక్తులు ఈ కేసును విచారిస్తోన్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయమై స్పందనను తెలియజేయాల్సిందిగా సీబీఐని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం కోరింది. మంగళ్ లాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్ అనే ముగ్గురు నీట్ పేపర్ లీక్ కేసు నిందితులు తాము నిర్దోషులమని రుజువు చేసుకొనేందుకు ఈ టెస్ట్‌లను జరపాలని కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..