Share News

ఆర్టీసీ నైట్‌ సర్వీసులకు ఆదరణ

ABN , Publish Date - Sep 16 , 2026 | 07:47 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ నైట్‌ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది.

ఆర్టీసీ నైట్‌ సర్వీసులకు ఆదరణ
Hyderabad RTC Night Services

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ నైట్‌ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఆరు రూట్లలో ఈనెల 1 నుంచి ప్రారంభించిన రాత్రి సర్వీసుల్లో రూట్‌ నంబరు 10హెచ్‌ కొండాపూర్‌-సికింద్రాబాద్‌కు సర్వీసులకు ఆదరణ బాగుందని అధికారులు పేర్కొన్నారు. బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌, కోఠి-పటాన్‌చెరు రూట్లలో ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. నెలరోజులపాటు నైట్‌ సర్వీసుల ఆక్యుపెన్సీ ఆధారంగా సమయపాలనల్లో మార్పులు చేపట్టనున్నారు.


city1.3.jpgరైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సలో రాత్రివేళల్లో దిగే ప్రయాణికులు నైట్‌ సర్వీసులను సద్వినియోగంచేసుకోవాలని అధికారులు కొరుతున్నారు. 8 రోజుల్లో 10 వేలమందికి పైగా ప్రయాణికులు నైట్‌సర్వీసుల్లో ప్రయాణించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రధాన మార్గాల్లో రాత్రి సర్వీసులు పెంచేదిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఏడీ శ్రీధర్‌ తెలిపారు. నైట్‌ సర్వీసులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.


city1.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 07:47 AM