చిన్నారుల అశ్లీల వీడియోలపై దర్యాప్తు సంస్థలకు నివేదిస్తాం: మెటా
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:55 AM
భారతదేశంలో తన సోషల్‌మీడియా వేదిక ‘ఇన్‌స్టాగ్రామ్’లో పోస్టు చేసిన చిన్నారుల అశ్లీల, లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు నివేదించేందుకు మెటా సంస్థ అంగీకరించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: భారతదేశంలో తన సోషల్‌మీడియా వేదిక ‘ఇన్‌స్టాగ్రామ్’లో పోస్టు చేసిన చిన్నారుల అశ్లీల, లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు నివేదించేందుకు మెటా సంస్థ అంగీకరించింది. చిన్నారుల లైంగిక దోపిడీని ప్రోత్సహించే ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రసారమవుతున్నాయని ఆరోపణలు రావడంతో భారత్‌లో మెటా కార్యకలాపాలపై తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి ఈ నిర్ణయం వెలువడింది. సోషల్ మీడియా వేదికలను చిన్నారుల పట్ల సురక్షితమైనవిగా మార్చేందుకు ఇది తొలి అడుగు అని కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది.