Share News

నేటి రాశి ఫలాలు.. 16-09-2026

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:06 AM

నేటి రాశి ఫలాలు.. బుధవారం 16-09-2026

నేటి రాశి ఫలాలు.. 16-09-2026

నేటి రాశి ఫలాలు.. బుధవారం 16-09-2026

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెడికల్‌ క్లెయిములు, బీమా వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మీరు గతంలో చేసిన శ్రమకు ప్రతిఫలం అందుకుంటారు. అడ్వాన్సులు, రుణాలు మంజూరవుతాయి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


03 MIDHUNAM.jpg

మిథునం( మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వ్యవసాయం. పరిశ్రమలు, హోటల్‌, వైద్య రంగాల వారు చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా లక్ష్యాలు సాధిస్తారు. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు, బిల్లులు అందుకుంటారు. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్‌, పాఠశాలలు, ఆడిటింగ్‌ రంగాల వారికి కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. లక్ష్యాలు సాధిస్తారు.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

రవాణా, కమ్యూనికేషన్లు, బోధన, వాహన రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమాచారం లేదా కీలక పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. సినిమా, రాజకీయ, న్యాయ, కళా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరంగా కీలక నిర్ణయాలకు ఇది తగిన సమయం. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తి అవుతాయి. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.


09 DHANUSU.jpg

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. పెద్దల సూచనలు పాటించి మంచి ఫలితాలు సాధిస్తారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థికసంస్థలు, బ్యాంకులు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అడ్వాన్సులు, రుణాలు మంజూరవుతాయి. పెన్షన్‌, బీమా, గ్రాట్యుటీ, మెడికల్‌ క్లెయిమ్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పది మందిని కలుపుకుని మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Sep 16 , 2026 | 01:06 AM