Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:26 AM

హైదరాబాద్ గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut Today

హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికనగర్‌, బేగంపేట ఐజిపురం ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎస్పీఆర్‌ హిల్స్‌ మహాత్మా నగర్‌, బేగంపేట విద్యుత్‌ టవర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


చిక్కడపల్లి: విద్యుత్‌ నిర్వహణ పనుల నిమిత్తం ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -1 డివిజన్ల పరిధిలో గురువారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్‌ తెలిపారు. కేఎంఐటీ, గగన్‌మహల్‌, ఆదర్శ్‌నగర్‌, గోశాల, తాళ్లబస్తీ 11కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఆప్కో, గాంధీకుటీర్‌ పరిధిలో మధ్యాహ్నం ఉదయం 11 నుంచి 12.30 గంటలవరకు, ప్రివెంటివ్‌ మెడిసిన్‌, దోమలగూడ, ఆర్‌కే మఠ్‌, ఆనంద్‌నగర్‌, రేణుకా ఎన్‌క్లేవ్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.


సైదాబాద్‌: టీజీఎస్పీడీసీఎల్‌ ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మత్తు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. 11కేవీ సమతా కాలేజ్‌, జవహర్‌పురా, జోరాబీ దర్గా, కుమ్మరవాడీ, పతేషానగర్‌ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అరుంధతీనగర్‌, హబీబ్‌ నగర్‌, రాజనర్సింహ్మ నగర్‌, ఎల్‌ఐసీ కాలనీ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.


city1.2.jpgసరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో..

సంతోష్‏నగర్‌: టీజీఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలలో మరమ్మతులు, చెట్లకొమ్మల కొట్టివేత పనుల కారణంగా గురువారం విద్యుత్‌సరఫరా నిలిపివేస్తునట్లు డీఈ తెలిపారు. 11కేవీ విద్యుత్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12.గంటల వరకు, 11కేవీ ప్రజయ్‌నివాస్‌, కొత్తపేట్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.


రామంతాపూర్‌: రామంతాపూర్‌ సబ్‌ స్టేషన్‌ విద్యుత్‌ నిర్వహణ పనుల నిమిత్తం కొన్ని ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా ఉండదని ట్రాన్స్‌కో ఏఈ లావణ ్య తెలిపారు. గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెంకట్‌ రెడ్డి నగర్‌, నవరంగ్‌ గూడ, కామాక్షీ పురం వీధి నంబర్‌ ఒకటి నుంచి ఐదు, వాసవీ నగర్‌, వివేక్‌ నగర్‌, యాదయ్య హోటల్‌ ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 07:26 AM