ఆగస్టు 30న నీట్ పీజీ పరీక్ష
ABN , Publish Date - Jul 02 , 2026 | 06:13 AM
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2026 ఆగస్టు 30వ తేదీన దేశ వ్యాప్తంగా జరగనుంది....
న్యూఢిల్లీ, జూలై 1 : వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2026 ఆగస్టు 30వ తేదీన దేశ వ్యాప్తంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈఎంఎస్) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూలై 1వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచే నీట్ పీజీ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. జూలై 21వ తేదీ మధ్యాహ్నం 11:55 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏ నగరాన్ని కేటాయించామనే సంగతిని ఆగస్టు 11న బోర్డు తెలియజేస్తుంది. ఇక, ఆగస్టు 30న పరీక్ష జరుగుతుంది. సెప్టెంబరు 30వ తేదీ నాటికి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News