హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Jun 27 , 2026 | 07:21 AM
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ, బాలాజీనగర్ సెక్షన్ల పరిధిలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ, బాలాజీనగర్ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈలు బొనిగాల విజయప్రకాష్, భీమలింగప్ప వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కేపీహెచ్‌బీ పరిధిలో.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్-1, ప్రసాద్ హాస్పిటల్, రవి హాస్పిటల్, ధనలక్ష్మీ సెంటర్, ఇడబ్ల్యూఎస్, శివాలయం రోడ్డు, ఎల్‌ఐజీ, జీహెచ్‌ఎంసీ పార్కు, రోడ్డు నంబర్-2, రోడ్ నంబర్-3, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు హనుమాన్ టెంపుల్, మయూరి ఎస్టేట్, నాలుగోఫేజ్ మెయిన్ రోడ్డు, చౌదరి మెస్, వాటర్ ట్యాంక్, శ్యామ్ ముఖర్జీ పార్కు పరిసర ప్రాంతాలలో విద్యుత్ ఉండదన్నారు.
బాలాజీనగర్ పరిధిలో.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మెజిస్టిక్ హిల్స్ విల్లాస్, వాసవీ అపార్ట్‌మెంట్స్, ఆంజనేయనగర్, మహిళా మండలి, మూసాపేట్, హబీబ్‌నగర్, గూడ్‌షెడ్ రోడ్డు, రాజీవ్‌గాంధీనగర్, సర్దార్‌నగర్, ఆంజనేయనగర్ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వివేక్‌నగర్, బాలాజీనగర్, న్యూ బాలాజీనగర్, పీపుల్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలతో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
పంజాగుట్ట: బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుమ్మరిబస్తీ, లక్ష్మీనగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిలికాన్ వ్యాలీ, ఏజీ కాలనీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో నూ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నెహ్రూపార్కు, బాపూనగర్ కమ్యూనిటీహాల్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్యామలకుంట పార్కు, మోనప్ప ఐలాండ్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
హయత్‌నగర్: ఇంజాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ సీఆర్‌పీఎఫ్ ఫీడర్, 11కేవీ మిధానీ ఫీడర్ పరిధిలో ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ప్రసారం నిలిపివేయబడుతుందని ఏఈ రాములు తెలిపారు. దీంతో సీఆర్‌ఫీఎస్ కాలనీ, తుల్జాభవానీ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, మైత్రి మెడోస్, సాయి దయాకాలనీ, దుర్గానగర్, నీలాద్రినగర్, ఇంజాపూర్ ఓల్డ్ విలేజీ, ఇందిరమ్మ కాలనీ, బాలాజీనగర్ కాలనీ, మిధానీ కాలనీ, హరితపురి కాలనీ, స్వామి నారాయణకాలనీ, ఇందిరమ్మ కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఇందిరమ్మ కాలనీ, అంజనపురి కాలనీలో ప్రసారంలో అంతరాయం కలుగుతుందన్నారు.
మన్నెగూడ ఫీడర్ పరిధిలో..
మన్నెగూడ, తుర్కయంజాల్, శోభానగర్ ఫీడర్‌ల పరిధిలో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు విద్యుత్ ప్రసారం ఉండదని తుర్కయంజాల్ సబ్‌స్టేషన్ ఏఈ రవీందర్‌రెడ్డి తెలిపారు. మన్నెగూడ పరిధిలోని హవెన్స్ కార్నర్, ఎన్‌ఎస్ఆర్ కాలనీ, శ్రీసాయి, హ్యాఫీహోమ్స్, సాయి టౌన్ షిప్, అవివా హోమ్స్, ఎంఎం కుంట, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు.. శోభానగర్, సినర్జీహోమ్స్, ద్వారాకానగర్, సిలికాన్‌నగర్, హ్యాపిల్ సిటీ, తుర్కయంజాల్ గ్రామం, ఏవీనగర్, విటేజీహోమ్స్, యాదాద్రి హోమ్స్, తుర్కయంజాల్ విలేజీ, లక్ష్మి మెగాటౌన్ షిప్, పాటిగూడ, సూరజ్‌నగర్, లక్ష్మిగార్డెన్, కుర్మగూడ, వైఎ్‌సఆర్‌కాలనీ, ఎంజాల్ గ్రామంలో విద్యుత్ ప్రసారం ఉండదని తెలిపారు.
నేరేడ్‌మెట్: నేరేడ్‌మెట్‌లోని వాజ్‌పేయ్‌నగర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని ఆఫీసర్‌కాలనీ 11 కేవీ పరిధిలోని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు నరికివేత, నిర్వహణ పనులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ లత తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యహ్నం 1 గంట వరకు వెంకటేశ్వరనగర్, కాకతీయనగర్, సాయినాథపురం, సమతానగర్, ఆఫీసర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. ఆర్‌కేపురం 11 కేవీ ఫీడర్ పరిధిలో మధ్యహ్నం 2 నుంచి సాయత్రం 5 గంటల వరకు ఆర్‌కేపురం, శ్రీకాలనీ, బ్యాంక్‌కాలనీ, అంతయ్యకాలనీ, సప్తగిరికాలనీ, ప్రేమ్‌నగర్‌కాలనీ, బాలాజీకాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆమె కోరారు.
పాలిటెక్నిక్ సబ్ స్టేషన్ పరిధిలో..
రామంతాపూర్: రామంతాపూర్ పాలిటెక్నిక్ సబ్ స్టేషన్ పరిధిలోని విశాల్ మార్ట్, చర్చికాలనీ ఫీడర్‌లలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ కూతడి లావణ్య తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విశాల్ మార్ట్ ఫీడర్‌లోని బ్రహ్మంగారి ఆలయం, గుప్తా గార్డెన్స్, మధురా నగర్, గణేష్ నగర్, పాలిటెక్నిక్ గేట్ వీధి, సాయి గార్డెన్స్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చి కాలనీ ఫీడర్‌లోని ప్రగతి నగర్ పార్క్, ఇందిరా నగర్ జెండా, సత్యనారాయణ స్వామి ఆలయం వీధి, నెహ్రూనగర్ పోచమ్మ గుడి, ఆనంద్ నగర్ ప్రాంతాలో విద్యుత్ సరఫరా ఉండదని ఆమె వెల్లడించారు.
బాలాజీహిల్స్ ఫీడర్ పరిధిలో...
ఉప్పల్: నిర్వహణ పనుల కారణంగా శనివారం చిల్కానగర్ విద్యుత్ విభాగం పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాలాజీహిల్స్ ఫీడర్ పరిధిలో నార్త్ బాలాజీహిల్స్, రాజశేఖర్ కాలనీ, బాలాజీహిల్స్, వెస్ట్ బాలాజీహిల్స్, మెక్‌డోవెల్ కాలనీ, న్యూ రామ్‌నగర్, న్యూ హేమానగర్, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అయ్యప్ప టెంపుల్ ఫీడర్ పరిధిలో ఈస్ట్ బాలాజీహిల్స్, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, స్వరూ్‌పనగర్, వెస్ట్ బాలాజీహిల్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారని వివరించారు.
- ఇందిరానగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ ఎన్.వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు 11 కేవీ సరస్వతీ నగర్ ఫీడర్ నుంచి శ్రీనగర్, సరస్వతీ నగర్, విజయపురి కాలనీ, శ్రీలక్ష్మీ నగర్, ఉదయనగర్, అశోక్ నగర్, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోడుప్పల్ సబ్ ేస్టషన్ పరిధిలోని 11 కేవీ ఉదయనగర్ ఫీడర్ నుంచి ప్రశాంత్ నగర్ మెయిన్ రోడ్, సాయిరాం నగర్, ఉదా లక్ష్మీ నగర్, కేశవ్ నగర్, ఆకృతి టౌన్‌షిప్, మారుతీ నగర్, కేశవ్ నగర్ కిరణ్ స్కూల్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు ‘డబుల్’ ఇళ్లు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News