Share News

తొమ్మిదో తరగతికి ‘సర్‌’పై పాఠం

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:47 AM

ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్‌’(ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను ఎన్‌సీఈఆర్‌టీ 9వ తరగతికి పాఠంగా పెట్టింది. ఈ ప్రక్రియను ఈసీ నిష్పాక్షికంగా చేపడుతోందని అందులో ప్రస్తుతించింది...

తొమ్మిదో తరగతికి ‘సర్‌’పై పాఠం

  • ఎన్సీఈఆర్టీ సాంఘిక శాస్త్రంలో చేర్పు

న్యూఢిల్లీ, జూన్‌ 26: ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్‌’(ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను ఎన్‌సీఈఆర్‌టీ 9వ తరగతికి పాఠంగా పెట్టింది. ఈ ప్రక్రియను ఈసీ నిష్పాక్షికంగా చేపడుతోందని అందులో ప్రస్తుతించింది. అర్హులకు అన్యాయం జరగకుండా, అనర్హులకు లబ్ధి చేకూరకుండా చూడటమే ‘సర్‌’ లక్ష్యమని తెలిపింది. ఫేక్‌ వార్తలు, తప్పుడు సమాచారం, బెదిరింపులతో ఎదురవుతున్న సవాళ్ల మధ్యనే, ‘సర్‌’ ప్రక్రియను ఈసీ ముందుకు తీసుకెళుతోందని కొనియాడింది. ఏడాదిగా చేపడుతున్న ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు ఆరు కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. దీనిపై విపక్షాలు, ఈసీ మధ్య తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సర్‌’ను ‘ఎన్‌సీఈఆర్‌టీ’ తొమ్మిదో తరగతికి పాఠ్యాంశంగా పెట్టడం ఆసక్తికర పరిణామం. ‘భారత్‌ లోపలి, వెలుపలి సమాజాల అధ్యయనం’ పేరిట కొత్తగా తయారుచేసిన సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో దీనిని చేర్చారు. ఇదిలా ఉండగా, దేశ పౌరుల హక్కుల పరిరక్షణకు మన న్యాయవ్యవస్థ నిష్పక్షపాత దృష్టితో కృషి చేస్తోందని తొమ్మిదో తరగతికి పెట్టిన పాఠంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ వ్యాఖ్యానించింది. ఎనిమిదో తరగతికి పెట్టిన పాఠం న్యాయవ్యవస్థను తక్కువ చేసేలా ఉన్నదంటూ గతంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, త్రిభాషాసూత్రం ప్రకారం రెండు విదేశీ భాషలను ఎంచుకుని చదువుతున్న 7, 9వ తరగతికి చెందిన విద్యార్థులు అవే భాషలను పదో తరగతి వరకు వారు కొనసాగించవచ్చునని, కనీసం రెండు దేశీయ భాషలు అన్న నిబంధన కేవలం ఆరో తరగతి వారికే వర్తిస్తుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

Updated Date - Jun 27 , 2026 | 06:47 AM